ధర్మవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
ధర్మవరం అర్బన్: ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఆన్ కాల్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దినసరి వేతన ప్రాతిపదికన పనిచేసేందుకు సిద్ధంగా ఉండి, హెవీ లైసెన్స్ కలిగి తగిన అనుభవం ఉన్న డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు మరియు లైసెన్సుతో సహా డిపోలోని మేనేజర్ కార్యాలయంలో స్వయంగా హాజరు కావాలని తెలిపారు. పోస్టుల సంఖ్య పరిమితంగా ఉన్నందున, ముందుగా వచ్చిన వారికే అర్హత కల్పించనున్నట్లు మేనేజర్ స్పష్టం చేశారు.
